ఐపీఎల్ కొత్త చైర్మన్ బిస్వాల్ | Ranjib Biswal appoint as Indian Premier League new chairman | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ కొత్త చైర్మన్ బిస్వాల్

Sep 29 2013 4:15 PM | Updated on Sep 1 2017 11:10 PM

ఐపీఎల్ కొత్త చైర్మన్ బిస్వాల్

ఐపీఎల్ కొత్త చైర్మన్ బిస్వాల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన చైర్మన్గా భారత క్రికెట్ జట్టు మాజీ సెలెక్టర్ రంజీబ్ బిస్వాల్ నియమితులయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన పేరును ఖరారు చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన చైర్మన్గా భారత క్రికెట్ జట్టు మాజీ సెలెక్టర్ రంజీబ్ బిస్వాల్ నియమితులయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన పేరును ఖరారు చేశారు. బీసీసీఐ చైర్మన్గా మరోసారి ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్కు బిస్వాల్ సన్నిహితుడు.

ఐపీఎల్ స్పాట్, బెట్టింగ్ ఆరోపణల అనంతరం శుక్లా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన బిస్వాల్ రాజీవ్ శుక్లా స్థానంలో ఐపీఎల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.  గతంలో టీమిండియా మేనేజర్గా ఆయన పనిచేశారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ పదవిలో ఉన్నారు. తాజాగా ఆయన స్థానంలో కేరళకు చెందిన టి.సి.మాథ్యూ బాధ్యతలు చేపట్టనున్నారు. బిస్వాల్ 1987-1996 మధ్య కాలంలో ఒడిశా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement