తొలి రోజు గుజరాత్‌దే | Ranji Trophy final, Gujarat vs Mumbai Day 1 cricket score: MUM 228 | Sakshi
Sakshi News home page

తొలి రోజు గుజరాత్‌దే

Jan 11 2017 1:10 AM | Updated on Aug 21 2018 2:29 PM

తొలి రోజు గుజరాత్‌దే - Sakshi

తొలి రోజు గుజరాత్‌దే

డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో తొలి రోజే గుజరాత్‌ జట్టు పట్టు సాధించింది. తమ బౌలర్ల అద్భుత రాణింపుతో పటిష్ట ముంబైని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగింది.

 ముంబై 228 ఆలౌట్‌
ఇండోర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో తొలి రోజే గుజరాత్‌ జట్టు పట్టు సాధించింది. తమ బౌలర్ల అద్భుత రాణింపుతో పటిష్ట ముంబైని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయగలిగింది. ఫలితంగా మంగళవారం ముంబై జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. టీనేజి సంచలనం పృథ్వీ షా (93 బంతుల్లో 71; 11 ఫోర్లు) తన బ్యాటింగ్‌ ఫామ్‌ను మరోసారి ప్రదర్శించగా.. సూర్యకుమార్‌ (133 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు. అభిషేక్‌ నాయర్‌ (94 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపిం చాడు. ఆర్పీ సింగ్, చింతన్‌ గజా, రుజుల్‌ భట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన గుజరాత్‌ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఒక ఓవర్‌లో 2 పరుగులు చేసింది. క్రీజులో సమిత్‌ గోహెల్‌ (2 బ్యాటింగ్‌), ప్రియాంక్‌ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement