రంగారెడ్డి బాలికల డబుల్‌ ధమాకా | rangareddy got two tiles in women sepak takraw | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి బాలికల డబుల్‌ ధమాకా

Oct 19 2017 10:02 AM | Updated on Oct 19 2017 10:02 AM

rangareddy got two tiles in women sepak takraw

హైదరాబాద్‌: స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌) రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా టోర్నమెంట్‌లో రంగారెడ్డి బాలికల జట్లు అండర్‌–14, 17 విభాగాల్లో విజేతగా నిలిచాయి.సరూర్‌నగర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన అండర్‌–14 బాలికల ఫైనల్లో రంగారెడ్డి 2–1 స్కోరుతో నిజామాబాద్‌పై గెలిచింది. సెమీస్‌లో రంగారెడ్డి 2–0తో ఆదిలాబాద్‌పై, నిజామాబాద్‌ 2–0తో హైదరాబాద్‌పై గెలుపొందాయి. అండర్‌–17 ఫైనల్లోనూ రంగారెడ్డి 2–0తో నిజామాబాద్‌పైనే నెగ్గింది. సెమీస్‌లో రంగారెడ్డి 2–0తో వరంగల్‌పై, నిజామాబాద్‌ 2–0తో నల్లగొండపై నెగ్గాయి.

అండర్‌–14 బాలుర తుదిపోరులో మహబూబ్‌నగర్‌ 2–0తో నల్లగొండపై, అండర్‌–17 బాలుర టైటిల్‌ పోరులో వరంగల్‌ 2–0తో నిజామాబాద్‌పై విజయం సాధించాయి. స్క్వాష్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో వేణు, విష్ణు గెలుపొందారు. 48 కేజీల విభాగంలో వేణు 9–6తో కమలేశ్‌పై, బిపిన్‌ పాండే 12–8తో వేణుపై గెలువగా... 56 కేజీల కేటగిరీలో విష్ణు 6–2తో నందుపై, ఖుర్షీద్‌ 12–6తో విష్ణుపై నెగ్గారు. 52 కేజీల విభాగంలో శివమణి 10–7తో యశ్వంత్‌పై, 60 కేజీల కేటగిరీలో వేణు 12–8తో అజయ్‌పై నెగ్గారు.

Advertisement
 
Advertisement
Advertisement