నాదల్‌ పెద్ద తప్పే చేశాడా?

Rafael Nadal Breaking Crucial French Open Rule During Final - Sakshi

పారిస్‌/రొనాల్డ్‌ గారోస్‌: టెన్నిస్‌ రారాజు రఫెల్‌ నాదల్‌ 11వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను 6-4, 6-3, 6-2 సెట్ల తేడాతో చిత్తుగా ఓడించాడు. అయితే ఫైనల్‌ సమరంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడనే విమర్శలు నాదల్‌పై ఇప్పుడు మొదలయ్యాయి. 

అసలేం చేశాడు... ఫిలిప్పె ఛాట్రైర్‌ కోర్టులో జరిగిన ఫైనల్‌ పోరు సందర్భంగా మూడో సెట్‌ సమయంలో నాదల్‌ తన ఫిజిషియన్‌ను కోర్టులోకి రప్పించి మణికట్టుకు చికిత్స చేయించుకున్నాడు. అయితే అలా చికిత్స చేయించుకోవటం టోర్నీ రూల్స్‌ ప్రకారం విరుద్ధం. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. (కల నెరవేర్చాడు..! ఆసక్తికర కథనం)

దిగ్గజాల మండిపాటు... నాదల్‌ చేసింది ఘోర తప్పిదమని టెన్నిస్‌ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ‘అలాంటప్పుడు మెడికల్‌ టైమ్‌ అవుట్‌లో తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నించొచ్చు. కానీ, ఇలా సెట్‌ మధ్యలో ఉండగా ఫిజిషియన్‌ను రప్పించుకుని చికిత్స చేయించుకోవటం మాత్రం ముమ్మాటికీ నేరమే’ అని మాజీ ఆటగాడు గ్రెగ్‌ రుసెదిస్కి చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో నాదల్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని మరో దిగ్గజం అన్నాబెల్‌ క్రోఫ్ట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ నిర్వాహకులను డిమాండ్‌ చేస్తున్నారు. 

రూల్స్‌ నాదల్‌కు వర్తించవా?.. ఈ టోర్నీలో రాబిన్ హాసే(నెదర్లాండ్స్‌)‌, డెవిడ్‌ గొఫ్ఫిన్‌ (బెల్జియం) మ్యాచ్‌ సందర్భంగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే చైర్‌ అంఫైర్లు మాత్రం చికిత్సకు నిరాకరించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రుసెదిస్కి టోర్నీ నిర్వాహకులపై మండిపడ్డాడు. ‘నాదల్స్‌కు రూల్స్‌ వర్తించవా? అతనికి మినహాయింపు ఎందుకిచ్చారు? అతనికి శిక్ష పడాల్సిందే... అంటూ రుసెదిస్కి కోరుతున్నారు. 

నాదల్‌ రియాక్షన్‌... వివాదంపై నాదల్‌ స్పందించాడు. చేతి కండరాలు పట్టేయటంతోనే ఫిజీషియన్‌ను పిలిపించుకున్నట్లు తెలిపాడు. సెమీస్‌ నుంచే తనకు నొప్పి వేధించిందని, ఈ వివాదాన్ని అనవసరంగా పెద్దది చేయొకండంటూ ఆయన మాజీలకు విజ్ఞప్తి చేస్తున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top