ఫోర్బ్స్‌ జాబితాలో బ్యాడ్మింటన్‌ స్టార్లు

PV Sindhu, Saina Nehwal and Srikanth Kidambi feature on Forbes 2017 Celebrity 100 list - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్‌ ఇండియా’ తాజాగా విడుదల చేసిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో హైదరాబాద్‌ షట్లర్లు ముగ్గురికి చోటు దక్కింది. ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు (13వ ర్యాంక్‌), కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ (29వ ర్యాంక్‌) ఈ జాబితాలో ఉన్నారు. 2017లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టోర్నీ విజయాలతో పాటు వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరిన మరో షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ (83)కు కూడా టాప్‌–100లో స్థానం లభించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top