రెండో రౌండ్‌లో సింధు | pv sindhu in second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సింధు

Jan 15 2015 12:31 AM | Updated on Sep 2 2017 7:43 PM

ఈ ఏడాది తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న హైదరాబాద్ క్రీడాకారులు పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ శుభారంభం చేశారు.

కౌలాలంపూర్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న హైదరాబాద్ క్రీడాకారులు పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ శుభారంభం చేశారు. బుధవారం మొదలైన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ ముగ్గురూ తొలి రౌండ్ అడ్డంకిని దాటారు.

మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రెండో సీడ్ సింధు 21-13, 21-11తో అయూమి మినె (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ కశ్యప్ 21-17, 21-15తో షి కుయ్ చున్ (చైనీస్ తైపీ)పై, సాయిప్రణీత్ 21-16, 21-12తో లిన్ యు సెయి (చైనీస్ తైపీ)పై నెగ్గారు. భారత్‌కే చెందిన ఆదిత్య ప్రకాశ్, శుభాంకర్ డే కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement