క్వార్టర్స్ లో సింధు | PV Sindhu Enters Macau Open Badminton Quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ లో సింధు

Nov 26 2015 5:31 PM | Updated on Sep 3 2017 1:04 PM

క్వార్టర్స్ లో సింధు

క్వార్టర్స్ లో సింధు

భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గైర్హాజరీతో మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగిన మరో భారత ఆశాకిరణం పివి సింధు అంచనాలకు తగ్గట్టు రాణిస్తోంది.

మకావు:  భారత స్టార్ ప్లేయర్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి  సైనా నెహ్వాల్ గైర్హాజరీతో మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బరిలోకి దిగిన మరో భారత ఆశాకిరణం పివి సింధు అంచనాలకు తగ్గట్టు రాణిస్తోంది. మహిళల సింగిల్స్ లో భాగంగా జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 21-17, 21-18 తేడాతో లిందావేణి ఫణేత్రి(ఇండోనేషియా)పై గెలిచి క్వార్టర్స్ కు చేరింది.

 

46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింధు ఆకట్టుకుంది. దీంతో తన ముఖాముఖి రికార్డును 6-2తో మెరుగుపరుచుకుంది. బుధవారం  కిమ్ హో మిన్ (కొరియా)ను కంగుతినిపించిన సింధు అదే జోరును ప్రి క్వార్టర్స్ లో కూడా కొనసాగించింది. సింధు తన తదుపరి గేమ్ లో చెన్ యుఫీ(చైనా)తో తలపడనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement