సింధు ముందుకు... సైనా ఇంటికి | PV Sindhu Eases into Second round, Saina Nehwal Exits Early | Sakshi
Sakshi News home page

సింధు ముందుకు... సైనా ఇంటికి

Sep 19 2019 2:52 AM | Updated on Sep 19 2019 3:10 AM

 PV Sindhu Eases into Second round, Saina Nehwal Exits Early  - Sakshi

చాంగ్‌జౌ (చైనా): మరో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్‌ షట్లర్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. అయితే మరో భారత స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఐదో సీడ్‌ సింధు కేవలం 34 నిమిషాల్లో 21–18, 21–12తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌ (చైనా)పై అలవోకగా గెలిచింది. ఎనిమిదో సీడ్‌ సైనా 10–21, 17–21తో ప్రపంచ 19వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌íÙప్‌ కాంస్య పతక విజేత సాయిప్రణీత్‌ 72 నిమిషాల్లో 21–12, 21–23, 21–14తో సుపన్యు అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)పై శ్రమించి నెగ్గగా... పారుపల్లి కశ్యప్‌ 21–12, 21–15తో బ్రైస్‌ లెవెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement