పుణే ఆశలు సజీవం | pune won by 2-0 with mumbai team | Sakshi
Sakshi News home page

పుణే ఆశలు సజీవం

Dec 4 2014 12:30 AM | Updated on Sep 2 2017 5:34 PM

పుణే ఆశలు సజీవం

పుణే ఆశలు సజీవం

నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ సత్తా చాటింది.

2-0తో ముంబైపై గెలుపు  
 ఐఎస్‌ఎల్
 
 పుణే: నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ సత్తా చాటింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 2-0తో ముంబై సిటీ ఎఫ్‌సీపై విజయం సాధించింది. పుణే తరఫున డుడు (66, 80వ ని.) రెండు గోల్స్ చేశాడు. 66వ నిమిషంలో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి కట్సొరనిస్ ఇచ్చిన పాస్‌ను డుడు డ్రిల్ చేసుకుంటూ వెళ్లి గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు.
 
  80వ నిమిషంలో మరోసారి కట్సొరనిస్ బంతిని డ్రిల్ చేస్తూ వెళ్లాడు. అప్పటికే గోల్ పోస్ట్ దగ్గర ఉన్న డుడు పాస్‌ను అందుకుని నెట్‌లోకి పంపి ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. ప్రస్తుతం పుణే 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరగా... ముంబై 12 పాయింట్లతో అట్టడుగున కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement