పుజారా డ్యాన్స్‌ చూశారా..! | Pujara just cant dance after India stars celebrate historic win | Sakshi
Sakshi News home page

పుజారా డ్యాన్స్‌ చూశారా..!

Jan 7 2019 1:22 PM | Updated on Jan 8 2019 12:38 AM

Pujara just cant dance after India stars celebrate historic win - Sakshi

సిడ్నీ: ఆసీస్‌ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్‌ విజయాన్ని సాధించి కొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌లో  భాగంగా ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో భారత్‌ 2-1తో గావస్కర్‌-బోర్డర్‌ ట్రోఫీని అందుకుంది. చివరి టెస్టు మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయ కల్గించడంతో భారత్‌కు మరో విజయం దూరమైంది. అయినప్పటికీ సిరీస్‌ను సాధించడంతో విరాట్‌ సేన మంచి జోష్‌తో  సంబరాలు చేసుకుంది.  గ్రౌండ్‌లో డ్యాన్స్‌ చేస్తూ విజయాన్ని ఆస్వాదించింది టీమిండియా క్రికెట్‌  జట్టు.

అయితే ఈ సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు గెలుచుకున్న చతేశ్వర్‌ పుజారా మాత్రం డ్యాన్స్‌ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. అంతా డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తుంటే పుజారా మాత్రం తన కాలును కదిలించకుండా కేవలం చప్పట్లతో సరిపెట్టబోయాడు. అయితే వెనుక నుంచి మిగతా సభ్యులు పుజారాను ముందుకు తోయడంతో  రిషభ్‌ పంత్‌తో కలిసి డ్యాన్స్‌ చేయకతప్పలేదు. అలా పుజారా ఇబ్బంది పడుతూనే మిగతా సభ్యులతో భాగస్వామయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. పుజారా బ్యాటింగ్‌ చేయగలడు కానీ.. డ్యాన్స్‌ చేయలేడు అంటూ క్యాప్షన్‌లో చమత్కరించింది.

చరిత్ర సృష్టించిన కోహ్లి సేన

ఇంత గొప్పగా ఎప్పుడూ ఫీల్‌ కాలేదు: కోహ్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement