తొలి వేట యు ముంబాదే..

Pro Kabaddi League U Mumba Beat Telugu Titans - Sakshi

నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌

టైటాన్స్‌పై 31-25తేడాతో యు ముంబా గెలుపు

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో  యు ముంబా శుభారంభం చేసింది. సొంత మైదానంలో జరుగుతున్న సీజన్‌ ఆరంభపు మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ చేతులెత్తేసింది. శనివారం హైదరాబాద్‌ వేదికగా తెలుగు టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31-25 తేడాతో యు ముంబా ఘనవిజయం సాధించింది. ముంబై ఆటగాడు అభిషేక్‌ సింగ్‌ పది రైడింగ్‌ పాయింట్లతో చెలరేగగా.. డిఫెండర్స్‌ రోహిత్‌ బలియాన్‌, సందీప్‌ నర్వాల్‌ తలో నాలుగు ట్యాకిల్‌ పాయింట్లతో టైటాన్స్‌ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. టైటాన్స్‌ ఆటగాళ్లలో రజ్నిష్‌ 8 రైడింగ్‌ పాయింట్లతో ఆకట్టుకున్నప్పటికీ మిగతా వారి నుంచి సహకారం అందలేదు. సారథి అబోజర్‌ నాలుగు సార్లు ట్యాకిల్‌లో విఫలమవడం టైటాన్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top