
పుణే: ప్రారంభంలోనే దక్కిన ఆధిక్యాన్ని చేజార్చుకున్న తెలుగు టైటాన్స్... తమిళ్ తలైవాస్ చేతిలో ఓడింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా రెండు జట్ల మధ్య సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 31–25 తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. ఆ జట్టు తరఫున మన్‌జీత్ ఛిల్లర్, అజయ్ ఠాకూర్ ఏడేసి పాయింట్లతో మెరిశారు.
రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 37–27తో యూపీ యోధాను ఓడించింది. లీగ్‌కు మంగళవారం విరామం. బుధవారం హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్, బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ ఆడతాయి.