వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ‘ట్రంప్ మ్యాచ్’ నిబంధనను అమలు చేయనున్నారు.
న్యూఢిల్లీ: వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కొత్తగా ‘ట్రంప్ మ్యాచ్’ నిబంధనను అమలు చేయనున్నారు. ఆట స్వరూపాన్ని మార్చే ఈ నిబంధన కారణంగా లీగ్‌లో పోటీతత్వం పెరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక రోజులో ఇరు జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల్లో ఏదైనా ఒకదాన్ని ట్రంప్ మ్యాచ్‌గా పేర్కొనే అవకాశం జట్లకు ఉంటుంది. ఇలా పేర్కొన్న మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు బోనస్ పాయింట్‌ను ఇస్తారు.
అయితే ఓడితే మాత్రం నెగటివ్ పాయింట్ (-1) పొందాల్సి ఉంటుంది. పోటీలకు గంట ముందు ఇరు జట్లు తమ ట్రంప్ మ్యాచ్ ను పేర్కొన డంతో పాటు అందులో ఆడే ఆటగాళ్ల పేర్లను నిర్వాహకులకు చెప్పాల్సి ఉంటుంది. రెండు జట్లు కూడా ఒకే మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా పేర్కొనవచ్చు. రెండు పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.