కోహ్లి వర్సెస్‌ రోహిత్‌

Predicting Who Will Have The Most Runs In T20Is After The Bengaluru Game  - Sakshi

బెంగళూరు: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. వర్షం అంతరాయం కల్గించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ చేయడమే మేలని భావించిన కోహ్లి తొలుత బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. గత మ్యాచ్‌లో కొనసాగించిన జట్టుతోనే భారత్‌ మూడో టీ20 కూడా సిద్ధమైంది. కచ్చితంగా సిరీస్‌ గెలవాలని భావిస్తున్న టీమిండియా ఎటువంటి మార్పులు చేయలేదు. గత మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.  తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దయ్యింది.

కోహ్లి వర్సెస్‌ రోహిత్‌
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి తొలి స్థానంలో ఉండగా, రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రెండో టీ20లో కోహ్లి రాణించడంతో రోహిత్‌ శర్మ రికార్డును సవరించాడు. మరొకవైపు అత్యధికంగా యాభైకి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా కోహ్లి, రోహిత్‌లే తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. దాంతో వీరిద్దరి మధ్య పరుగుల పోటీ ఏర్పడింది. ఈ రోజు మ్యాచ్‌లో రోహిత్‌ రాణిస్తే కోహ్లి రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉంది.

గత మ్యాచ్‌లో రోహిత్‌ నిరాశ పరచడంతో కచ్చితంగా ఈ మ్యాచ్‌లోనైనా ఆకట్టుకోవాలని ఉన్నాడు. అదే సమయంలో కోహ్లి కూడా ఫామ్‌ను కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి 2,441 పరుగులతో ఉండగా, రోహిత్‌ 2,434 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక యాభైకి పరుగుల్ని కోహ్లి 22 సార్లు సాధించగా, రోహిత్‌ 21 సార్లు సాధించాడు. ఇక్కడ కోహ్లి ఖాతాలో సెంచరీలు ఏమీ ఉండకపోగా, రోహిత్‌ శర్మ ఖాతాలో నాలుగు అంతర్జాతీయ టీ20 సెంచరీలు ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top