ప్రి క్వార్టర్స్‌లో కశ్యప్ | pre-quarters in Kashyap | Sakshi
Sakshi News home page

ప్రి క్వార్టర్స్‌లో కశ్యప్

Mar 3 2016 12:43 AM | Updated on Sep 3 2017 6:51 PM

ప్రి క్వార్టర్స్‌లో కశ్యప్

ప్రి క్వార్టర్స్‌లో కశ్యప్

జర్మన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు.

ముల్హీమ్ అన్ డెర్ రుర్ (జర్మనీ ): జర్మన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో కశ్యప్ 21-12, 21-11తో జోషువా మజీ (ఐర్లాండ్)పై గెలిచాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో కశ్యప్ 21-9, 21-9తో అర్తెమ్ పొచ్‌తరెవ్ (ఉక్రెయిన్)ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 12-21, 21-18, 21-11తో టకుమా ఉయెదా (జపాన్)పై, సమీర్ వర్మ 21-9, 21-8తో దిమిత్రో జవద్‌స్కీ (ఉక్రెయిన్)పై గెలిచారు. మరోవైపు పీవీ సింధు 21-11, 21-13తో రోంగ్ ష్కాఫెర్ (అమెరికా)పై విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మిచెల్లి లీ (కెనడా)తో సింధు ఆడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement