సింగిల్స్‌ సెమీస్‌లో ప్రాంజల | pranjula enters semis of itf womens tourney | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ సెమీస్‌లో ప్రాంజల

Sep 29 2017 10:26 AM | Updated on Sep 29 2017 10:26 AM

Pranjula

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లోని హువహిన్‌ పట్టణంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో క్వాలిఫయర్‌ ప్రాంజల 6–2, 6–0తో ఒజ్‌జెన్‌ పెమ్రా (టర్కీ)పై అలవోక విజయం సాధించింది. సెమీస్‌లో ఆమె అమెరికాకు చెందిన రెండో సీడ్‌ జాక్వెలిన్‌ కకోతో తలపడనుంది. జాక్వెలిన్‌ 4–6, 7–6 (8/6), 2–1తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి జులియా గ్లుష్కో (ఇజ్రాయెల్‌) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement