సౌజన్య పరాజయం | Sowjanya Fight Ends In ITF Tourney | Sakshi
Sakshi News home page

సౌజన్య పరాజయం

Nov 17 2019 10:26 AM | Updated on Nov 17 2019 10:26 AM

Sowjanya Fight Ends In ITF Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో జాతీయ చాంపియన్, హైదరాబాద్‌ అమ్మాయి సౌజన్య భవిశెట్టి పోరాటం ముగిసింది. గ్వాలియర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సౌజన్య 4–6, 3–6తో ఏడో సీడ్‌ సోఫియా షపటవా (జార్జియా) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సౌజన్య మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

అంతకుముందు ఈ టోర్నీలో సౌజన్య తొలి రౌండ్‌లో 6–3, 7–5తో జాక్వలైన్‌ సబజ్‌ అవాద్‌ (స్వీడన్‌)పై, రెండో రౌండ్‌లో 6–4, 6–3తో రెండో సీడ్‌ దరియా మర్సిన్‌కెవికా (లాత్వియా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 6–3, 2–6, 6–4తో మరియా తిమోఫీవా (రష్యా)పై విజయం సాధించింది. 


 

Advertisement
 
Advertisement
Advertisement