టైటిల్‌ పోరుకు ప్రాంజల | pranjula enters final of ITf tourney | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు ప్రాంజల

Oct 21 2017 11:04 AM | Updated on Oct 21 2017 11:04 AM

pranjula enters final of ITf tourney

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శ్రీలంకలోని కొలంబోలో జరుగుతోన్న ఈ టోర్నీలో ప్రాంజల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ ప్రాంజల 6–1, 6–4తో నాలుగో సీడ్‌ బోలెమ్‌ జోసెఫిన్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది.

అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో ప్రాంజల 6–4, 6–4తో జీల్‌ దేశాయ్‌ (భారత్‌)ను ఓడించింది. మరోవైపు మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో మూడో సీడ్‌ ప్రాంజల–రుతుజా భోస్లే (భారత్‌) ద్వయం 6–2, 6–3తో టాప్‌సీడ్‌ అనిడినోవా (కజకిస్తాన్‌)–కరోవిక్‌ తమారా (సెర్బియా) జంటను కంగుతినిపించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement