ప్రాంజల ముందంజ | pranjala is at first | Sakshi
Sakshi News home page

ప్రాంజల ముందంజ

Sep 17 2014 1:07 AM | Updated on Sep 2 2017 1:28 PM

ప్రాంజల ముందంజ

ప్రాంజల ముందంజ

సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్-2 టోర్నీలో తెలుగు అమ్మాయి ఎడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్-2 టోర్నీలో తెలుగు అమ్మాయి ఎడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. ఈజిప్టులోని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 6-4, 6-2తో జోవిక్ నికోలినా (సెర్బియా)పై విజయం సాధించింది. తద్వారా క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్ లో ప్రాంజల 7-6 (7/2), 6-2తో నటాలి కల్‌ముంజెరోవా (చెక్)ను ఓడించింది. బుధవారం జరిగే క్వార్టర్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి సెంగిజ్ బెర్ఫ్ (టర్కీ)తో తలపడుతుంది.
 క్వార్టర్స్‌లో నిఖిత జోడి
 చిలకలగూడ: చిదంబర అయ్యర్ స్మారక టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో సాయి నిఖిత జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. త్రివేండ్రంలో జరుగుతున్న ఈ టోర్నీ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయి నిఖిత-ఆస్థా బాబాసాహెబ్ ద్వయం 6-0, 6-1 తేడాతో కావ్యభరత్-పవిత్ర జంటపై గెలిచింది. సింగిల్స్ విభాగం లో మొదటి రౌండ్‌లో నాలుగో సీడ్ ఆరియాలి చవాన్‌పై 6-2, 6-2తో విజయం సాధించిన సాయినిఖిత.. రెండో రౌండ్‌లో డైనా అబీ చేతిలో పరాజయం పాలైంది. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన సాయి నిఖిత జాతీయ స్థాయిలో జరిగిన పలు టోర్నమెంట్లలో పాల్గొని అనేక టైటిళ్లను సొంతం చేసుకుంది.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement