
యోగాలో ప్రమీలకు స్వర్ణం
హైదరాబాద్ కు చెందిన జి.ప్రమీల రాష్ట్రస్థాయి యోగా చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది.
హైదరాబాద్: నగరానికి చెందిన జి.ప్రమీల రాష్ట్రస్థాయి యోగా చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది. తెలంగాణ యోగా కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా భారతి సొసైటీ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ పోటీల్లో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. 40 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన ఈవెంట్‌లో ఆమె బంగారు పతకం గెలుచుకుంది.
రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమెకిది వరుసగా రెండో స్వర్ణం కాగా... గతంలో ఢిల్లీ, చెన్నై నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో నాలుగో స్థానం పొందింది.