ప్రదీప్‌ 26, తలైవాస్‌ 25 | Patna Pirates beat Tamil Thalaivas | Sakshi
Sakshi News home page

ప్రదీప్‌ 26, తలైవాస్‌ 25

Sep 10 2019 4:36 AM | Updated on Sep 10 2019 4:36 AM

Patna Pirates beat Tamil Thalaivas - Sakshi

కోల్‌కతా: పట్నా పైరేట్స్‌ రైడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 26 పాయింట్లు సాధించి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా 51–25తో తమిళ్‌ తలైవాస్‌ను చిత్తు చేసింది. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో ప్రదీప్‌ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్‌ సాధించిన పాయింట్లే ఎక్కువ. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 33–26తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. గుజరాత్‌ రైడర్‌ సచిన్‌ సూపర్‌ టెన్‌తో రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement