బెంగళూరుకి షాకిచ్చిన పంజాబ్ | panjab beat banglore by 22 runs | Sakshi
Sakshi News home page

బెంగళూరుకి షాకిచ్చిన పంజాబ్

May 14 2015 12:42 AM | Updated on Sep 3 2017 1:58 AM

బెంగళూరుకి షాకిచ్చిన పంజాబ్

బెంగళూరుకి షాకిచ్చిన పంజాబ్

పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న పంజాబ్ పటిష్టమైన బెంగళూరుకి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లో స్థానం పొందాలనుకున్న బెంగళూరు ఆశలపై నీల్లు చల్లింది.

మెహాలీ: పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న పంజాబ్ పటిష్టమైన బెంగళూరుకి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లో స్థానం పొందాలనుకున్న బెంగళూరు ఆశలపై నీల్లు చల్లింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 10 ఓవర్లకి కుదించి, ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది.

ఐపీఎల్-8లో భాగంగా నేడు (బుధవారం) కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ని 10 ఓవర్లకి కుదించారు. ముందుగా టాస్ గెలిచిన బెంగళూర్ ఫిల్డీంగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 10 ఓవర్లలో 106 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. బెంగుళూరు ముందు 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ ఓపెనర్ గా వచ్చిన సాహా మొదట్లోనే 12 బంతుల్లోనే31 పరుగులు రాబట్టి ధాటిగా ఆడాడు. ఆ తర్వాత పరుగుల వేటలో పంజాబ్ వికెట్లు వరుసగా కోల్పోయింది... వోహ్రా(11), మిల్లర్(14), మ్యాక్స్ వెల్(10) బెయిలీ(13), మాన్ సింగ్(2)లు పరుగులు చేశారు. అక్సర్ పటేల్(20), రిషి ధావన్ (1)లు పరుగలు చేసి నాటౌట్ గా నిలిచారు. బెంగళూరు బౌలర్లు హర్ష పటేల్,ఛాహ్లాలు తలో రెండు వికెట్లు తీయగా, స్టార్క్, వీయిసేలు తలో వికెట్ తీశారు.

107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు తడబడుతూ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. దీంతో 10 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 22 పరుగుల తేడాతో బెంగళూర్ పై విజయం సాధించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement