పాకిస్తాన్ తొలి వార్మప్ మ్యాచ్ రద్దు | Pakistan warm-up match cancelled | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ తొలి వార్మప్ మ్యాచ్ రద్దు

Mar 11 2016 8:00 PM | Updated on Sep 3 2017 7:30 PM

వరల్డ్ టీ 20లో భాగంగా బెంగాల్ జట్టుతో శనివారం నగరంలోని ఈడెన్ గార్డెన్ లో పాకిస్తాన్ ఆడాల్సి ఉన్న తొలి వార్మప్ మ్యాచ్ రద్దయ్యింది.

కోల్ కతా: వరల్డ్ టీ 20లో భాగంగా శనివారం నగరంలోని ఈడెన్ గార్డెన్ లో బెంగాల్ జట్టుతో జరగాల్సి ఉన్న పాకిస్తాన్ తొలి వార్మప్ మ్యాచ్ రద్దయ్యింది. పాక్ ఆటగాళ్ల భద్రతపై భారత ప్రభుత్వం నుంచి హామీ లభించిన అనంతరం ఆ దేశ క్రికెట్ జట్టు శుక్రవారం సాయంత్రం వరల్డ్ టీ 20 బయల్దేరనుంది.  రేపు సాయంత్రం లోగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్కు వచ్చే అవకాశం ఉండటంతో ఆ జట్టు ఆడే తొలి వార్మప్ మ్యాచ్ రద్దు చేయక తప్పలేదు. ఇదిలా ఉండగా, ఇదే స్టేడియంలో మార్చి 14 వ తేదీన పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ యథావిధిగా జరుగనుంది.


భారత్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనపై గత కొన్ని రోజులుగా అనిశ్చితి నెలకొన్న క్రమంలో మ్యాచ్ టికెట్ల అమ్మకం కూడా ఆలస్యం కానుంది.  ఈ నెల 19 వ తేదీన ఇరు జట్ల మధ్య కోల్ కతాలో జరిగే మ్యాచ్ కు సంబంధించి టికెట్ల అమ్మకాన్ని 16వ తేదీ నుంచి ఆరంభిచనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) స్పష్టం చేసింది. భద్రతా కారణాల నేపథ్యంలో పాకిస్తాన్-భారత్ మ్యాచ్ ను ధర్మశాల నుంచి కోల్ కతాకు మార్చడం కెట్ల అమ్మకం ఆలస్యం కావడానికి మరో కారణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement