పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు భారత్‌లో ఆడేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్‌లో జరగనున్న ‘శాఫ్’ కప్ కోసం పొరుగుదేశం జట్టు ఇక్కడికి రానుంది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు భారత్‌లో ఆడేందుకు రంగం సిద్ధమైంది. డిసెంబర్‌లో జరగనున్న ‘శాఫ్’ కప్ కోసం పొరుగుదేశం జట్టు ఇక్కడికి రానుంది. అయితే ఇరుదేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నా... పాక్ ఫుట్‌బాల్ జట్టు కు మాత్రం అనుమతి లభిస్తుందని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల న్యూఢిల్లీలో తీసిన టోర్నీ డ్రాలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్లు కలిసి మ్యాచ్‌లు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన ఈ దక్షిణాసియా చాంపియన్‌షిప్‌కు పాకిస్తాన్ ఒక్కసారి కూడా గైర్హాజరు కాలేదు. డిసెంబర్ 23 నుంచి జనవరి 3, 2016 వరకు తిరువనంతపురంలో ఈ టోర్నీ జరగనుంది. మరోవైపు పాక్ ఆటగాళ్లు హెచ్‌ఐఎల్‌లో పాల్గొనేలా హెచ్‌ఐతో చర్చలు జరుపుతామని పాక్ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్) కార్యదర్శి సుభాన్ అహ్మద్ తెలిపారు. ఆటను మెరుగు పర్చుకోలేకపోవడంతో పాటు పెద్ద మొత్తం లో వచ్చే డబ్బును పాక్ ఆటగాళ్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాక్ ఆటగాళ్ల మితిమీరిన ప్రవర్తన కారణంగా వాళ్లను హెచ్‌ఐఎల్‌కు దూరంగా పెట్టారు.