క్రికెటర్‌ ఇంట విషాదం

Pakistan Cricketer Asif Ali Loses Two year old daughter to Cancer - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అసిఫ్‌ అలీ ఇంట విషాదం చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి రెండేళ్ల కూతురు నూర్ ఫాతిమా ఆదివారం తుది శ్వాస విడిచింది.  ఈ విషాదకర వార్తను అసిఫ్‌ అలీ పాకిస్తాన్‌ క్రికెట్‌ లీగ్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ప్రాంఛైజీ తన అధికారిక ట్విటర్‌లో తెలిపింది.‘అసిఫ్‌ అలీ కూతురు నూర్‌ ఫాతిమా మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. అసిఫ్‌కు అతడి కుటుంబసభ్యులకు ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ ఫ్యామిలీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఈ క్రికెటర్‌ హుటాహుటిన అమెరికాకు పయనమయ్యాడు. 

గత కొద్ది రోజుల క్రితమే తన కూతరు క్యాన్సర్‌తో పోరాడుతుందని ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే. అయితే మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకెళ్తున్నామని తెలిపాడు. ఈ సందర్భంగా అమెరికా వెళ్లడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలపుతూ మరో ట్వీట్‌ చేశాడు. ‘నా కుమార్తెకు క్యాన్సర్‌. ప్రస్తుతం ఫోర్త్‌ స్టేజ్‌లో ఉంది. ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకి తీసుకొచ్చాం. కేవలం ఒక్క గంటలోనే తన కుమార్తెకి వీసా మంజూరు చేసిన ఇస్లామాబాద్ యుఎస్ ఎంబసీ, లాహోర్‌లోని యుఎస్ ఎంబసీకి ధన్యవాదాలు. స్పెషల్ థ్యాంక్స్ టు మైక్, ఎలిజిబెత్, తన్వీర్ భాయ్’ అంటూ ట్వీట్ చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top