పాక్ తడబాటు

పాక్ తడబాటు - Sakshi


 తొలి ఇన్నింగ్స్ 118/5

 శ్రీలంక 300 ఆలౌట్


 గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడింది. మూడో రోజు  శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ ఆట ముగిసే సమయానికి 41.4 ఓవర్లలో 118 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. పేసర్ దమ్మిక ప్రసాద్ (2/24) తన వరుస ఓవర్లలో ఓపెనర్లు హఫీజ్ (2), షెహజాద్ (9)లను అవుట్ చేయడంతో పాక్ కష్టాలు ప్రారంభమయ్యాయి. సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ (79 బంతుల్లో 47; 6 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

 

 క్రీజులో అసద్ షఫీఖ్ (59 బంతుల్లో 14 బ్యాటింగ్), సర్ఫరాజ్ అహ్మద్ (20 బంతుల్లో 15 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. ఫాలోఆన్ తప్పించుకునేందుకు పాక్ ఇంకా 151 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 178/3తో తమ తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 109.3 ఓవర్లలో 300 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ కౌశల్ సిల్వా (300 బంతుల్లో 125; 16 ఫోర్లు) కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. అయితే పాక్ బౌలర్ల ధాటికి లంక మిడిలార్డర్  రాణించలేకపోయింది. రియాజ్, బాబర్‌లకు మూడేసి వికెట్లు.. యాసిర్, హఫీజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top