చాంప్ పద్మిని | Padmini Raut won the title | Sakshi
Sakshi News home page

చాంప్ పద్మిని

Nov 5 2014 12:33 AM | Updated on Sep 2 2017 3:51 PM

చాంప్ పద్మిని

చాంప్ పద్మిని

సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ విజేతగా నిలిచింది. మరో రౌండ్ మిగిలి ఉండగానే పద్మినికి టైటిల్ ఖాయమైంది.

జాతీయ మహిళల ప్రీమియర్ చెస్
 

 సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ విజేతగా నిలిచింది. మరో రౌండ్ మిగిలి ఉండగానే పద్మినికి టైటిల్ ఖాయమైంది. మంగళవారం జరిగిన పదో రౌండ్‌లో పద్మిని 94 ఎత్తుల్లో తెలంగాణకు చెందిన హిందూజా రెడ్డిపై గెలిచింది. ప్రస్తుతం పద్మిని 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నిషా మొహతా (పీఎస్‌పీబీ), మేరీ ఆన్ గోమ్స్ (బెంగాల్) ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

ఫలితంగా బుధవారం జరిగే చివరిదైన 11వ రౌండ్ గేమ్ ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండా పద్మినికి టైటిల్ ఖరారైంది. మరోవైపు ఇదే టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు బొడ్డ ప్రత్యూష, కె.లక్ష్మీ ప్రణీతలకు మరో పరాజయం ఎదురైంది. పదో రౌండ్ లో లక్ష్మీ ప్రణీత 54 ఎత్తుల్లో నిషా మెహతా చేతిలో; ప్రత్యూష 38 ఎత్తుల్లో వర్షిణి (తమిళనాడు) చేతిలో ఓడిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement