‘రోహిత్‌కు అంత ఈజీ కాదు’ | Opening Is A Specialized Job Nayan Mongia | Sakshi
Sakshi News home page

‘రోహిత్‌కు అంత ఈజీ కాదు’

Sep 16 2019 1:49 PM | Updated on Sep 16 2019 1:56 PM

Opening Is A Specialized Job Nayan Mongia - Sakshi

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో అడపా దడపా అవకాశాలు దక్కించుకునే టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో అతను ఎక్కడ బ్యాటింగ్‌  చేస్తాడు అనే విషయం చర‍్చకు వచ్చింది. ఈ సిరీస్‌కు కేఎల్‌  రాహుల్‌ను తప్పించడంతో రోహిత్‌ శర్మ ఓపెనర్‌గానే బరిలోకి దిగడం అనేది దాదాపు ఖాయం.  ఈ విషయంపై  చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ వివరణ ఇచ్చే క్రమంలో రోహిత్‌ను ఓపెనర్‌గా టెస్టుల్లో కూడా పరీక్షించాలనుకుంటున్నామని తెలిపాడు.

అంతకుముందు భారత దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు కూడా రోహిత్‌ను టెస్టు ఓపెనర్‌గా దింపడానికి మద్దతుగా నిలిచారు. కాగా, రోహిత్‌ టెస్టు ఓపెనర్‌గా సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదని అంటున్నాడు మాజీ వికెట్‌  కీపర్‌ నయాన్‌ మోంగియా. ఈ కొత్త ప్రపోజల్‌ భారత్‌కు  లాభించకపోవచ్చని పేర్కొన్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా కొన్ని మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న మోంగియా.. ఈ ఫార్మాట్‌లో  ఓపెనింగ్‌ అనేది అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు.

‘టెస్టుల్లో ఓపెనింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన జాబ్‌. వికెట్‌ కీపింగ్‌ తరహాలో టెస్టుల్లో ఓపెనర్‌గా సెట్‌ కావడం కష్టంతో కూడుకున్న పని. రోహిత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఓపెనర్‌గా సక్సెస్‌ కావడం  వేరు.. టెస్టుల్లో ఓపెనింగ్‌ స్థానంలో రాణించడం వేరు. ఇక్కడ ఒక ప్రత్యేక మైండ్‌సెట్‌తో ఆడాలి. పరిస్థితులకు తగ్గట్టు మైండ్‌ సెట్‌ను మార్చుకుంటూ ఉండాలి. వన్డే, టీ20ల్లో  తరహాలో ఆడితే ఇక‍్కడ కుదరదు. టెస్టు క్రికెట్‌ అనేది ఒక విభిన్నమైన ఫార్మాట్‌. ఒకవేళ టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ ఓపెనర్‌గా సెట్‌ అయితే, అప్పుడు అది అతని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది’ అని మోంగియా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement