‘ధోని భవిష్యత్‌ను సెలక్టర్లే నిర్ణయించాలి’ | Sakshi
Sakshi News home page

‘ధోని భవిష్యత్‌ను సెలక్టర్లే నిర్ణయించాలి’

Published Sat, Nov 18 2017 7:30 PM

 Only Selectors Should Decide About MS Dhoni's Future, Says Kapil Dev - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, కానీ అతని టీ20 భవిష్యత్‌ను మాత్రం సెలక్టర్లే నిర్ణయించాలని మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డారు. శనివారం కృష్ణపట్టణం పోర్ట్‌ గోల్డెన్‌ ఈగల్స్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ఎవరూ జీవితాంతం ఆడరు. కానీ ధోని అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక ధోని టీ20ల్లో ఆడే విషయాన్ని సెలక్టర్లకే వదిలేస్తున్నా. అతని విషయంలో వారే సరైన నిర్ణయం తీసుకోగలరు. నేను నా అభిప్రాయం చెబితే అది గందరగోళానికి కారణం అవుతోంది. అందుకే చెప్పడం లేదు. చాలా సమయం ఉంది. అతను ఆడాల లేదా అనే విషయం వారే నిర్ణయిస్తారు.’ అని కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యానించారు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ అనంతరం ధోని బ్యాటింగ్‌ వేగంపై సినీయర్‌ క్రికెటర్ల నుంచి విమర్శల వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement