ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా ఒలింపిక్‌ మెడలిస్ట్‌

Olympic Medallist Becomes A Food Delivery Boy - Sakshi

టోక్యో:  కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కరోనా దెబ్బతో ఇప్పటికే ఆర్థిక మాంద్యం మొదలైంది. దాంతో సాధారణ ప్రజలు దగ్గర్నుంచీ సెలబ్రెటీలు కూడా ఆర్థిక వెసులుబాటు కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ కోవలోకి వస్తాడు జపాన్‌కు చెందిన ఫెన్సర్‌ రియో మియాక్‌. గతంలో ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించిన రియో మియాక్‌.. ఇప్పుడు కరోనా వల్ల ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఆర్థికంగా నిలబడటంతో పాటు రాబోయే పోటీల్లో పాల్గొనడానికి రోజు వారి ఖర్చుల కోసం పని చేస్తున్నాడు. ఇందుకు ఉబర్‌ ఈట్స్‌ను ఎంచుకున్నాడు. ఉబర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా చేరి రోజూ రెండువేలు యెన్‌లు సంపాదిస్తున్నాడు. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో టీమ్‌ విభాగంలో రజత పతకం గెలిచిన రియో మియాక్‌.. ఈఏడాది తమ దేశంలో జరిగే ఒలింపిక్స్‌ సిద్ధమయ్యాడు. (భారీ నష్టం తప్పదు : సౌరవ్‌ గంగూలీ)

అయితే అది కాస్తా వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో రియో మియాక్ ఇక చేసేది లేక డెలివరీ బాయ్‌గా చేరిపోయాడు. ఒకవైఫు ఫిట్‌నెస్‌ను కాపాడుకున్నట్లు ఉంటుంది.. మరొకవైపు ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుందని ఆలోచించిన మైకేల్‌ ఇలా ఉబర్‌ ఈట్స్‌లో ఫుడ్‌డెలివరీ చేస్తున్నాడు. ‘ నాకు విరామం దొరకడంతో డబ్బులు కోసం మార్గం ఆలోచించా. అంతే తడువుగా ఉబర్‌ ఈట్స్‌లో జాయిన్‌ అయ్యా. నా శారీరక ధృడత్వాన్ని కాపాడుకుంటానికి కూడా ఇదొక ఎక్సర్‌సైజ్‌లా ఉంది. ఎక్కడైతే కరోనా వైరస్‌ రిస్క్‌ తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లోనే ఫుడ్‌ డెలివరీ చేస్తున్నా.  ఇక్కడ ఆర్డర్‌ చేసిన వారి గుమ్మం ముందే ఫుడ్‌ను ఉంచి భౌతిక దూరాన్ని పాటిస్తున్నా. నేను ఎప్పుడైతే ఆర్డర్‌ రిసీవ్‌ చేసుకున్నానో ఆ తర్వాత రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్‌ తీసుకెళుతున్నా’ అని మియాక్‌ తెలిపాడు. ఫెన్సింగ్‌ అనేది ఒక క్రీడ అని, దానికి చాలా ఫిట్‌గా ఉండాలని పేర్కొన్నాడు. తగిన ప్రాక్టీస్‌ లేకుండా ఇంట్లో కూర్చొంటే ఆ క్రీడలో రాణించడం కష్టమన్నాడు. (క్వారంటైన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top