ఫైనల్లో ఫెడరర్‌ | Novak Djokovic desperate for Roger Federer victory in Cincinnati final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఫెడరర్‌

Aug 20 2018 1:20 AM | Updated on Aug 20 2018 1:20 AM

Novak Djokovic desperate for Roger Federer victory in Cincinnati final - Sakshi

సిన్సినాటి (అమెరికా): కెరీర్‌ లో 99వ సింగిల్స్‌ టైటిల్‌ సాధించేందుకు స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌... కెరీర్‌లో 70వ సింగిల్స్‌ టైటిల్‌ సొంతం చేసుకునేందుకు సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ విజయం దూరంలో ఉన్నారు. సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఫెడరర్‌ 7–6 (7/3), 1–1తో డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై, జొకోవిచ్‌ 6–4, 3–6, 6–3తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలిచారు. ఫెడరర్‌తో జరిగిన మ్యాచ్‌లో గాఫిన్‌ తొలి సెట్‌లో ఓడిపోయాక, రెండో సెట్‌లో స్కోరు 1–1 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా వైదొలిగాడు.  

 

Advertisement
 
Advertisement
Advertisement