వివేకానంద్‌కు అర్హత ఉంది | no problem for vivek to participate in hcl elections, says sesh narayan | Sakshi
Sakshi News home page

వివేకానంద్‌కు అర్హత ఉంది

Jan 16 2017 11:48 AM | Updated on Sep 4 2018 5:07 PM

వివేకానంద్‌కు అర్హత ఉంది - Sakshi

వివేకానంద్‌కు అర్హత ఉంది

వివేకానంద్‌కు కేబినెట్ ర్యాంక్ ఉంది కాని ఆయన కేబినెట్ మంత్రి కాదని, అందుకు ఆయనకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందని తెలిపారు.

హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... కానీ పోటీ చేసేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వాటి ప్రకారం పోటీ చేయవచ్చు అని హెచ్‌సీఎ కార్యదర్శి బరిలో ఉన్న శేష్‌నారాయణ్ అన్నారు. ఆయన హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీపడే ముందు ఓటర్‌గా నమోదు చేసుకోలేదని గుర్తు చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్ అడ్వైజర్ మసూద్ ఖాన్‌తో కలిసి మాట్లాడుతూ... వివేకానంద్‌కు కేబినెట్ ర్యాంక్ ఉంది కాని ఆయన కేబినెట్ మంత్రి కాదని, అందుకు ఆయనకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందని తెలిపారు.

 

మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ హెచ్‌సీఎను పూర్తిగా భ్రష్టుపట్టించారని... తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పూర్తి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాము తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎలాంటి అవినీతికి, పైరవీలకు వీలు లేకుండా నడుస్తామని హామీ ఇచ్చారు. లోధా కమిటీ సిఫార్సులు, కోర్టు పరిధిలోనే ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు హన్మంత్‌రెడ్డి, అనిల్ కుమార్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement