లీ చోంగ్ వీపై తాత్కాలిక సస్పెన్షన్ | No. 1 Lee Chong Wei fails doping test | Sakshi
Sakshi News home page

లీ చోంగ్ వీపై తాత్కాలిక సస్పెన్షన్

Nov 9 2014 12:20 AM | Updated on Sep 2 2017 4:06 PM

లీ చోంగ్ వీపై తాత్కాలిక సస్పెన్షన్

లీ చోంగ్ వీపై తాత్కాలిక సస్పెన్షన్

కౌలాలంపూర్: ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లీ చోంగ్ వీపై వేటు పడింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడం తో తాత్కాలికంగా అతడిపై సస్పెన్షన్ విధించారు.

డోపింగ్ టెస్టులో విఫలం

 కౌలాలంపూర్: ప్రపంచ నంబర్‌వన్ బ్యాడ్మింటన్ ఆటగాడు లీ చోంగ్ వీపై వేటు పడింది. డోపింగ్ టెస్టులో విఫలం కావడం తో తాత్కాలికంగా అతడిపై సస్పెన్షన్ విధించారు. అయితే అధికారికంగా మలేసియా బ్యాడ్మింటన్ సంఘం (బీఏఎం) ఇతడి పేరును వెల్లడించడం లేదు. ‘మా ఆటగాడి ‘బి’ శాంపిల్‌లో నిషేధిత డెక్సామిథాసోన్ వాడినట్టు తేలింది.

అయితే అతడి పేరును వెల్లడించేందుకు మాకు స్వేచ్ఛ లేదు. ఈ ఆటగాడు కఠోర శ్రమతో పైకి వచ్చినవాడే కాకుండా అత్యద్భుతమైన ఆటగాడు. తన విజయాలేవీ అడ్డదారులో రాలేదని నమ్ముతున్నాం’ అని బీఏఎం డిప్యూటీ అధ్యక్షుడు నోర్జా జకారియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement