టైటిల్‌ పోరుకు నిఖిత, కావ్య

స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: ఆనంద్‌ నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పోర్ట్స్‌ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) ఆధ్వర్యంలో జరుగుతోన్న స్టేట్‌ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హెచ్‌ఎస్‌ నిఖిత, కావ్య ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్‌ బాలికల సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో వీరిద్దరూ విజయం సాధించారు. తొలి సెమీస్‌లో నిఖిత (వీపీజీ) 11–6, 11–5, 11–5, 11–3తో ధ్రితి (జీఎస్‌ఎం)పై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో కావ్య (ఏడబ్ల్యూఏ) 6–11, 12–10, 11–7, 11–5, 11–7తో ప్రగ్యాన్ష (వీపీజీ)ని ఓడించింది. మరోవైపు బాలుర విభాగంలో జతిన్‌దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌), పార్థ్‌ భాటియా (ఏడబ్ల్యూఏ), శౌర్య రాజ్‌ సక్సేనా (ఎంఎల్‌ఆర్‌), కార్తీక్‌ (నల్లగొండ) సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో జతిన్‌దేవ్‌11–8, 11–5, 11–5తో ధ్రువ్‌ సాగర్‌ (జీఎస్‌ఎం)పై, పార్థ్‌ భాటియా 11–4, 11–6, 11–4తో ఒమర్‌ మంజూర్‌ ఖాన్‌ (వీపీజీ)పై, శౌర్యరాజ్‌ 11–7, 11–6, 11–8తో తరుణ్‌ ముఖేశ్‌ (ఎంహెచ్‌జే)పై, కార్తీక్‌ 8–11, 11–9, 11–8, 10–12, 11–6తో మహేశ్‌ (జీటీటీఏ)పై విజయం సాధించారు.   

ఇతర ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌ల వివరాలు

సబ్‌ జూనియర్‌ బాలురు: కార్తీక్‌ (ఏడబ్ల్యూఏ) 3–0తో ఎ. వరుణ్‌పై, ప్రణవ్‌ (ఏడబ్ల్యూఏ) 3–0తో సయ్యద్‌ నజీబుల్లా (ఏడబ్ల్యూఏ)పై, త్రిశూల్‌ మెహ్రా (ఎల్బీ స్టేడియం) 3–1తో యశ్‌ గోయెల్‌ (జీఎస్‌ఎం)పై, సాయికిరణ్‌ (ఏడబ్ల్యూఏ) 3–2తో శ్రేష్ట్‌ (ఏడబ్ల్యూఏ)పై, అథర్వ (ఏడబ్ల్యూఏ) 3–0తో రాజు (ఏడబ్ల్యూఏ)పై, జి. వివేక్‌ సాయి (హెచ్‌వీఎస్‌) 3–1తో క్రిష్‌ సింఘ్వి (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు.  

బాలికలు: ఎన్‌. భవిత (జీఎస్‌ఎం) 3–0తో నందిని (వీపీజీ)పై, విధిజైన్‌ 3–0తో వై. శ్రేయ సత్యమూర్తిపై, ఫాతిమా (డాన్‌బాస్కో) 3–1తో పూజపై, నమ్రత 3–2తో నిఖితపై, అనన్య (జీఎస్‌ఎం) 3–1తో మెర్సీ (హెచ్‌వీఎస్‌)పై, గోధ తేజస్విని (నల్లగొండ) 3–2తో పలక్‌పై, ప్రియాన్షి (జీఎస్‌ఎం) 3–0తో ప్రగ్యాన్ష (వీపీజీ)పై, ఇక్షిత (ఏడబ్ల్యూఏ) 3–0తో అహ్మదీ నౌసీన్‌ (డాన్‌బాస్కో)పై విజయం సాధించారు.  

మహిళల సింగిల్స్‌: నైనా 4–0తో శరణ్య (జీఎస్‌ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 4–0తో హనీఫాపై, లాస్య (ఏడబ్ల్యూఏ) 4–3తో ఇక్షిత (ఏడబ్ల్యూఏ)పై, జి. ప్రణీత (హెచ్‌వీఎస్‌)4–0తో దివ్య (హెచ్‌వీఎస్‌)పై, బి. రాగ నివేది (జీటీటీఏ) 4–0తో వినిచిత్ర (జీఎస్‌ఎం)పై, మౌనిక (జీఎస్‌ఎం) 4–0తో పలక్‌ షా (ఏవీఎస్‌సీ)పై, నిఖత్‌ బాను (ఆర్‌బీఐ) 4–0తో ఐశ్వర్య డాగా (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top