నిధి చిలుములకు టైటిల్‌ | Nidhi Chilumula gets AITA Womens Singles Title | Sakshi
Sakshi News home page

నిధి చిలుములకు టైటిల్‌

Mar 11 2019 10:27 AM | Updated on Mar 11 2019 10:27 AM

Nidhi Chilumula gets AITA Womens Singles Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) పురుషుల, మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి నిధి చిలుముల విజేతగా నిలిచింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలుచుకొని ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకుంది. ఆదివారం గంటన్నరపాటు జరిగిన తుదిపోరులో ఏడో సీడ్‌ నిధి చిలుముల 6–4, 6–0తో నాలుగో సీడ్‌ సోహా సాధిక్‌ (కర్ణాటక)పై విజయం సాధించింది.

విజేతగా నిలిచిన నిధి రూ. 15,600 ప్రైజ్‌మనీగా అందుకుంది. పురుషుల సింగిల్స్‌లో స్థానిక ఆటగాడు అన్విత్‌ బింద్రే చాంపియన్‌గా నిలిచాడు. డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి శ్రావ్య చిలకలపూడి జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో శ్రావ్య (తెలంగాణ)–వైదేహి చౌదరి (గుజరాత్‌) ద్వయం 4–6, 6–1, 10–5తో షేక్‌ హుమేరా–సారా యాదవ్‌ (తెలంగాణ) జంటపై పోరాడి గెలుపొందింది.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement