భారత్‌ తో తొలి టీ20: టాస్ నెగ్గిన కివీస్ | New Zealand won toss elected to filed first | Sakshi
Sakshi News home page

భారత్‌ తో తొలి టీ20: టాస్ నెగ్గిన కివీస్

Nov 1 2017 6:47 PM | Updated on Nov 1 2017 7:01 PM

New Zealand won toss elected to filed first

న్యూఢిల్లీ: భారత్‌ తో ఇక్కడ జరగనున్న తొలి టీ20లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్ కు అనుకూలించే ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలో తొలి టీ20లో టాస్ కీలకమన్న విషయం తెలిసిందే. టాస్ గెలిస్తే భారత్ కూడా ఛేజింగ్ వైపే మొగ్గుచూపేది. అసలే ట్వంటీ20లో టీమిండియా నెగ్గని పటిష్ట జట్టు కివీస్. భారత ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ క్రీజులోకి వచ్చారు. 

ఇప్పుడు న్యూజిలాండ్‌తో టి20ల్లో మాత్రం భారత్‌కు సవాల్‌ ఎదురుగా నిలిచింది. ప్రత్యర్థిపై మన గత రికార్డు ప్రతికూలంగా ఉండగా, తాజా ఫామ్‌ కూడా కివీస్‌కే అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు (బుధవారం) ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలో జరిగే తొలి టి20లో ఇరు జట్లు తలపడుతున్నాయి. గతంలో ఒక్క మ్యాచ్ లోనూ కివీస్ పై నెగ్గిన చరిత్ర లేని టీమిండియా.. నేటి మ్యాచ్ లోనైనా నెగ్గి వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు ఘనంగా వీడ్కోలు పలకాలని కోహ్లీసేన భావిస్తోంది.

తుది జట్లు
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్‌ శర్మ, శ్రేయస్ అయ్యర్, ధోని, పాండ్యా, అక్షర్‌ పటేల్, భువనేశ్వర్‌, బుమ్రా, ఆశిష్‌ నెహ్రా, చహల్‌  
న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టామ్ బ్రూస్, లాథమ్, నికోల్స్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, బౌల్ట్, సౌతీ, ఇష్‌ సోధి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement