కివీస్‌ ఆలౌట్, లంక టాపార్డర్‌ ఔట్‌

 New Zealand seek record series win in Sri Lanka decider - Sakshi

తొలిరోజే 14 వికెట్లు

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు బౌలింగ్‌ గర్జనతో మొదలైంది. తొలిరోజు ఆటను పూర్తిగా బౌలర్లే శాసించడంతో ఏకంగా 14 వికెట్లు నేలకూలాయి. మొదట సురంగ లక్మల్‌ (5/54) కివీస్‌ ఆలౌట్‌కు నాంది పలికితే... తర్వాత టిమ్‌ సౌతీ (3/29) లంక టాపార్డర్‌ను పడేశాడు. బుధవారం ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌లో టిమ్‌ సౌతీ (68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటంతో ఆ మాత్రం స్కోరు సాధ్యమైంది.

లహిరు కుమార 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక తొలిరోజు ఆట నిలిచే సమయానికి 32 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో నిలబడిన సౌతీ తన బౌలింగ్‌తో లంకను దెబ్బమీద దెబ్బ తీశాడు. ఓపెనర్లు గుణతిలక (8), కరుణరత్నే (7),  కెప్టెన్‌ చండిమల్‌ (6)లను 21 పరుగులకే పెవిలియన్‌ చేర్చాడు. మాథ్యూస్‌ (27 బ్యాటింగ్‌), రోషన్‌ సిల్వా (15 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top