కివీస్‌దే తొలి టెస్టు | New Zealand enjoy 122-run win as Sri Lanka fold | Sakshi
Sakshi News home page

కివీస్‌దే తొలి టెస్టు

Dec 15 2015 2:37 AM | Updated on Sep 3 2017 1:59 PM

కివీస్‌దే తొలి టెస్టు

కివీస్‌దే తొలి టెస్టు

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు 122 పరుగుల తేడాతో విజయం సాధించింది.

18 నుంచి చివరి టెస్టు
డ్యునెడిన్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు 122 పరుగుల తేడాతో విజయం సాధించింది. 405 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక సోమవారం చివరి రోజు మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయి 95.2 ఓవర్లలో 282 పరుగులు మాత్రమే చేయగలిగింది. చండిమాల్ (132 బంతుల్లో 58; 11 ఫోర్లు), కుశాల్ మెండిస్ (150 బంతుల్లో 46; 5 ఫోర్లు) మాత్రమే రాణించారు.

109/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక చేతిలో ఏడు వికెట్లున్నా మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకునేందుకైనా పోరాడలేకపోయింది. సౌతీకి మూడు, బౌల్ట్, సాట్నర్, వాగ్నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. గప్టిల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 18 నుంచి హామిల్టన్‌లో చివరి టెస్టు జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement