భారత్‌ ‘ఎ’ ఓటమి

New Zealand A Beat India A By 29 Runs - Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: భారత ‘ఎ’ జట్టుకు న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన రెండో అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 29 పరుగుల తేడాతో ఓడింది. తొలుత న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 295 పరుగులు చేసింది. ఓపెనర్‌ జార్జ్‌ వర్కర్‌ (135; 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు.  భారత బౌలర్లలో ఇషాన్‌ పోరెల్‌ 3 వికెట్లు ... సిరాజ్‌ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేసి ఓడిపోయింది. మయాంక్‌ అగర్వాల్‌ (37; 2 ఫోర్లు, సిక్స్‌), ఇషాన్‌ కిషన్‌ (44; 2 ఫోర్లు, సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (41; 2 ఫోర్లు, సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా కీలకదశలో అవుటవ్వడంతో భారత్‌ ‘ఎ’ లక్ష్యానికి దూరంలో నిలిచింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top