నెదర్లాండ్స్ విజయం | Netherlands win | Sakshi
Sakshi News home page

నెదర్లాండ్స్ విజయం

Mar 18 2014 12:59 AM | Updated on Sep 2 2017 4:49 AM

నెదర్లాండ్స్ విజయం

నెదర్లాండ్స్ విజయం

ఓపెనర్ స్టీఫెన్ మైబర్గ్ (36 బంతుల్లో 55; 7 ఫోర్లు; 2 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకోవడంతో టి20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు బోణీ చేసింది.

ఓపెనర్ స్టీఫెన్ మైబర్గ్ (36 బంతుల్లో 55; 7 ఫోర్లు; 2 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకోవడంతో టి20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు బోణీ చేసింది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా యూఏఈ 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

 

షైమన్ అన్వర్ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు; 1 సిక్స్), ఖుర్రమ్ ఖాన్ (25 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా స్వప్నిల్ (28 బంతుల్లో 23; 2 ఫోర్లు)తో కలిసి ఖుర్రమ్ మూడో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. జమీల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత నెదర్లాండ్స్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 152 పరుగులు చేసి నెగ్గింది. టామ్ కూపర్ (26 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) చివరికంటా నిలిచి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. కమ్రాన్ షెహజాద్‌కు రెండు వికెట్లు దక్కాయి. కూపర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది
 

Advertisement
 
Advertisement
Advertisement