'రియో' అర్హతలో నీరజ్ విఫలం | Neeraj Goyat Fails to Secure Rio Berth, Settles for Bronze | Sakshi
Sakshi News home page

'రియో' అర్హతలో నీరజ్ విఫలం

Jul 9 2016 5:41 PM | Updated on Sep 4 2017 4:29 AM

'రియో' అర్హతలో నీరజ్ విఫలం

'రియో' అర్హతలో నీరజ్ విఫలం

రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయట్ విఫలమయ్యాడు.

న్యూఢిల్లీ:రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో భారత ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయట్ విఫలమయ్యాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం నిర్వహించిన ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ లో నీరజ్ కాంస్య పతకానికే పరిమితమై రియో బెర్తును సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శుక్రవారం వెనుజులాలో జరిగిన  సెమీ ఫైనల్ పోరులో నీరజ్ గోయట్ (69 కేజీలు) 0-3 తేడాతో అరాజిక్ మారుట్జాన్(జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యాడు.

 

మరోవైపు సెమీ ఫైనల్లో ఓడిన బాక్సర్ల మధ్య జరిగిన పోరులో కూడా నీరజ్ పరాజయం చెందాడు.  సిసోకో డియే యూబా (స్పెయిన్)తో జరిగే బౌట్‌లో కూడా నీరజ్ వైఫల్యం చెందడంతో రియో అర్హతపై పెట్టుకున్న ఆశలకు బ్రేక్ పడింది. అంతకుముందు మరో ఇద్దరు భారత ప్రొ బాక్సర్లు గౌరవ్ బిదురి, దిల్బాగ్ సింగ్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.

రియో అర్హతలో భాగంగా ప్రపంచంలోని ప్రొ బాక్సర్లకు ఐబా పోటీలు నిర్వహిస్తోంది. ప్రొ బాక్సర్లకు 26 రియో బెర్తులు ఉన్నా, ప్రతీ కేటగిరీ నుంచి ముగ్గురు మాత్రమే ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement