నవ్య, రాఘవిలకు స్వర్ణాలు

Navya, Raghavika got Gold Medals - Sakshi

గోల్డెన్‌ మైల్‌ రన్‌  

సాక్షి, హైదరాబాద్‌: అథ్లెటిక్స్‌ కోచింగ్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ‘గోల్డెన్‌ మైల్‌ రన్‌’ ఈవెంట్‌లో నవ్య, సీహెచ్‌ రాఘవి స్వర్ణాలను సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే జి. బాల్‌రాజ్‌ ప్రారంభించారు. మహిళల విభాగంలో నల్లగొండకు చెందిన నవ్య పరుగును 5 నిమిషాల 35.4 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన కీర్తి (5ని.46.2సె.), కె. తిరుపతమ్మ (5ని.46.6సె., రంగారెడ్డి) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్‌–16 బాలికల విభాగంలో సీహెచ్‌ రాఘవి (హైదరాబాద్, 5ని.10.4సె.), మహిత (5ని.32.0సె.), పుష్పలత (5ని. 32.4సె.) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్, స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ సి. వీరేందర్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
పురుషులు: 1. యోగేందర్‌ (హైదరాబాద్‌), 2. వై. రాఘవేంద్ర (‘సాయ్‌’), 3. ఎన్‌. శివ (‘సాయ్‌’).
అండర్‌–16 బాలురు: 1. ప్రియాన్షు (జీఐఓ), 2. కె. సంతోష్‌ నాయక్‌ (వికారాబాద్‌), 3. రంజిత్‌ (ఉత్తరప్రదేశ్‌);  
అండర్‌–13 బాలురు: 1. బి. మహేశ్‌ (రంగారెడ్డి), 2. ఎం. సాయి (రంగారెడ్డి), 3. నిషాంత్‌ కుమార్‌ (మేడ్చల్‌); బాలికలు: 1. శరణ్య (హైదరాబాద్‌), 2. కె. ఇందు ప్రియ (నాగర్‌కర్నూల్‌), 3. అఖిల (రంగారెడ్డి).  
అండర్‌–10 బాలురు: 1. ఆర్‌. శ్రీకాంత్‌ (వరంగల్‌), 2. ఎం.నవదీప్‌ (వరంగల్‌), 3. వి. కౌశిక్‌ (మెదక్‌); బాలికలు: 1. ఎం. శ్రీవిద్య (గీతాంజలి), 2. ఎం. రేవతి (ప్రగతి), 3. అంబిక (హైదరాబాద్‌).  
మాస్టర్‌ మెన్‌: 1. విజయ్‌ రాఘవన్‌ (హైదరాబాద్‌), 2. జగన్‌మోహన్‌ రెడ్డి (మేడ్చల్‌), 3. ప్రశాంత్‌ (మేడ్చల్‌).
మాస్టర్‌ ఉమెన్‌: 1. డి. బొల్లారెడ్డి (మేడ్చల్‌), 2. శిల్పా రాజు (హైదరాబాద్‌), 3. రాజేశ్వరి (హైదరాబాద్‌).

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top