విజేతలు నవీద్, రయీస్‌ | naveed and raees got boxing titles | Sakshi
Sakshi News home page

విజేతలు నవీద్, రయీస్‌

Jul 2 2017 10:27 AM | Updated on Sep 5 2017 3:02 PM

విజేతలు నవీద్, రయీస్‌

విజేతలు నవీద్, రయీస్‌

తెలంగాణ రాష్ట్ర జూనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన బాక్సర్లు మొహమ్మద్‌ నవీద్, మొహమ్మద్‌ రయీస్‌ సత్తా చాటారు.

జూనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర జూనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన బాక్సర్లు మొహమ్మద్‌ నవీద్, మొహమ్మద్‌ రయీస్‌ సత్తా చాటారు. ఎథిక్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. 46 కేజీల వెయిట్‌ కేటగిరీ ఫైనల్లో మొహమ్మద్‌ నవీద్, జి. అనీశ్‌పై గెలుపొందగా... 48 కేజీల విభాగంలో మొహమ్మద్‌ రయీస్, చైతన్యను ఓడించాడు.

 

ఇతర ఫైనల్‌ మ్యాచ్‌ల్లో 50 కేజీల విభాగంలో మొహమ్మద్‌ బిన్‌ ఉస్మాన్‌ (హైదరాబాద్‌), అజయ్‌పై, 52 కేజీల విభాగంలో పవన్‌ కల్యాణ్‌ (రంగారెడ్డి) బి. శ్రీనివాస్‌పై, 54 కేజీల విభాగంలో త్రిజోత్‌ సింగ్‌ (హైదరాబాద్‌) భరత్‌పై, 57 కేజీల విభాగంలో ఎన్‌. హరీశ్‌ (హైదరాబాద్‌) ఏవీ పవన్‌పై, 60 కేజీల విభాగంలో బి. హర్షిత్‌ (ఖమ్మం) సాయిపై, 63 కేజీల విభాగంలో ఎం. వేణు (హైదరాబాద్‌) ఆర్‌. రాహుల్‌పై, 70 కేజీల విభాగంలో రాకేశ్‌ యాదవ్‌ (రంగారెడ్డి) జి. హనుమాన్‌పై, 75 కేజీల విభాగంలో ఆర్యవ్‌ మిశ్రా (హైదరాబాద్‌) రంగా రోహిత్‌పై, 80+ కేజీల కేటగిరీలో పి. సాయిరామ్‌ డి. విశాల్‌పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. 80 కేజీల విభాగంలో ఎస్‌. హర్షవర్ధన్,  66 కేజీల విభాగంలో ఎన్‌. సౌరభ్‌లకు ఫైనల్లో బై లభించింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement