విజేత ఎన్‌ఏఎల్ | National aeronautical limited teams won | Sakshi
Sakshi News home page

విజేత ఎన్‌ఏఎల్

Jan 11 2014 12:42 AM | Updated on Sep 2 2017 2:29 AM

శాంతిస్వరూప్ భట్నాగర్ మెమోరియల్ క్రీడల్లో బెంగళూరుకు చెందిన నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్) జట్లు విజేతగా నిలిచాయి.

తార్నాక, న్యూస్‌లైన్: శాంతిస్వరూప్ భట్నాగర్ మెమోరియల్ క్రీడల్లో బెంగళూరుకు చెందిన నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్ (ఎన్‌ఏఎల్) జట్లు విజేతగా నిలిచాయి. తార్నాకలోని ఐఐసీటీ క్లబ్ గ్రౌండ్స్‌లో గత మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. దేశవ్యాప్తంగా ఉన్న 40 పరిశోధన సంస్థల నుంచి 16 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
 
 క్రికెట్, వాలీబాల్ రెండు ఈవెంట్లలోనూ ఎన్‌ఏఎల్ జట్లే విజయం సాధించాయి. ముగింపు వేడుకలకు సీఎస్‌ఐఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ టి.రామస్వామి ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement