ఏ చహల్‌ అది లేదబ్బా! : ధోని | MS Dhoni Remind Chahal that there Was No Option of Taking a Review | Sakshi
Sakshi News home page

Jun 29 2018 7:53 PM | Updated on Jun 29 2018 8:00 PM

MS Dhoni Remind Chahal that there Was No Option of Taking a Review - Sakshi

చహల్‌కు ధోని సైగలు

డబ్లిన్ : ఇంగ్లండ్‌తో ప్రధాన సిరీస్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో భారత జట్టు ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లోనే తమ ఆధిపత్యాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. పసికూనలపై విరుచుకుపడి భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌(డీఆర్‌ఎస్‌)ను ధోని రివ్యూ సిస్టమ్‌గా.. ఈ నిర్ణయంలో ధోని కింగ్‌ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. చాలా సందర్భాల్లో సైతం ఇది నిరూపితమైంది. అయితే ఈ విషయంలోనే చహల్‌ను ఇబ్బందులకు గురికాకుండా ధోని రక్షించాడు.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో చహల్‌ వేసిన బంతి ఆ జట్టు ఓపెనర్‌ షెనాన్‌ ప్లంబ్‌ ప్యాడ్స్‌కు తగిలింది. వెంటనే చహల్‌, భారత ఆటగాళ్లంతా అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే అలవాటులో భాగంగా అత్యుత్సాహంతో చహల్‌ రివ్యూ కోరే ప్రయత్నం చేశాడు. వెంటనే ధోని తన చేతులతో డీఆర్‌ఎస్‌ లేదబ్బా అని సైగ చేశాడు. దీంతో అతను సైలెంట్‌ అయిపోయాడు. అయితే ఐర్లాండ్‌తో జరిగే ఈ రెండు టీ20ల సిరీస్‌లో డీఆర్‌ఎస్‌ లేదనే విషయాన్ని చహల్ మరిచిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. గతంలో ఓ మ్యాచ్‌లో ధోని సరదాగా రివ్యూ కోరినట్లు సైగ చేయడంతో మ్యాచ్‌ రిఫరీ మందలించిన విషయం తెలిసిందే.  తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో గెలిచిన కోహ్లి సేన శుక్రవారం చివరిదైన రెండో టీ20 ఆడనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement