ధోనిని పరుగులు పెట్టించాడు..! | MS Dhoni plays hide and seek with the fan | Sakshi
Sakshi News home page

ధోనిని పరుగులు పెట్టించాడు..!

Mar 5 2019 6:46 PM | Updated on Mar 5 2019 7:25 PM

MS Dhoni plays hide and seek with the fan - Sakshi

నాగ్‌పూర్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ధోని కోసం ఓ అభిమాని సాహసం చేశాడు. ఏకంగా భద్రతా వలయాలను దాటుకోని మైదానంలోకి పరుగెత్తాడు. భారత్‌ బ్యాటింగ్‌ ముగిసిన తర్వాత ఫీల్డింగ్‌ చేయడానికి జట్టు సభ్యులు మైదానంలోకి వెళుతున్న సమయంలో ధోనికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు అభిమాని యత్నించాడు.

అయితే అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోని స్టేడియంలో పరుగులు తీశాడు. అయినా  సదరు అభిమాని వదల్లేదు. ధోనిని పరుగులు పెట్టించాడు. చివరకు ఎంతకూ ఆ అభిమాని వదలకపోవడం ధోని కూల్‌ కాక తప్పలేదు. దాంతో వికెట్ల వద్ద నిలబడిపోయిన ధోనిని అభిమాని గట్టిగా ఆలింగనం చేసుకుని ఆనందంతో మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement