ఎంఎస్‌ ధోని ‘వంద’నం | MS Dhoni completes 100 dismissals in Indian Premier League | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ ధోని ‘వంద’నం

May 13 2017 10:17 AM | Updated on Sep 5 2017 11:05 AM

ఎంఎస్‌ ధోని ‘వంద’నం

ఎంఎస్‌ ధోని ‘వంద’నం

‘మిస్టర్‌ కూల్‌’ మహేంద్ర సింగ్‌ ధోని మరో మైలురాయిని అందుకున్నాడు.

న్యూఢిల్లీ: ‘మిస్టర్‌ కూల్‌’ మహేంద్ర సింగ్‌ ధోని మరో మైలురాయిని అందుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో వంద మందిని అవుట్‌ చేసిన వికెట్‌ కీపర్‌గా ఖ్యాతికెక్కాడు. ఫిరోషా కోట్లా మైదానంలో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతడీ ల్యాండ్‌మార్క్‌ను చేరుకున్నాడు. జాదవ్‌ ఉనాద్కత్‌ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టి ధోని ‘వంద’ నం చేశాడు. ఐపీఎల్‌లో వంద మందిని అవుట్‌ చేసిన ఘనత ధోని కంటే ముందు దినేష్‌ కార్తీక్‌ సాధించాడు.

35 ఏళ్ల ధోని 156 ఐపీఎల్‌ మ్యాచుల్లో 71 క్యాచులు, 29 స్టంపింగ్స్‌ చేశాడు. ఒక్క చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపునే 129 మ్యాచులు ఆడాడు. గత సీజన్‌ నుంచి రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై రెండేళ్లు నిషేధం విధించడంతో అతడు టీమ్‌ మారాల్సివచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement