భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి | Men's hockey: India lose to Belgium in quarter-finals | Sakshi
Sakshi News home page

భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి

Aug 15 2016 1:56 AM | Updated on Sep 4 2017 9:17 AM

భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి

భారత హాకీ జట్టు ఆశలు ఆవిరి

రక్షణ శ్రేణిలో లోపాలు... ఫార్వర్డ్ శ్రేణిలో దూకుడు లోపించడంతో... రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పోరాటం ముగిసింది.

 క్వార్టర్ ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి
 రియో డి జనీరో: రక్షణ శ్రేణిలో లోపాలు... ఫార్వర్డ్ శ్రేణిలో దూకుడు లోపించడంతో... రియో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 1-3 గోల్స్ తేడాతో బెల్జియం చేతిలో ఓడిపోయింది. బెల్జియం  96 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ హాకీలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆట 15వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

 రెండో క్వార్టర్ ముగిసేవరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. అయితే మూడో క్వార్టర్‌లో బెల్జియం ఆటగాళ్లు దూకుడు పెంచారు. వరుస దాడులతో భారత్‌పై ఒత్తిడి పెంచారు. 34వ, 45వ నిమిషాల్లో సెబాస్టియన్ డాకీర్ రెండు గోల్స్ చేయడంతో బెల్జియం 2-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. 50వ నిమిషంలో టామ్ బూన్ గోల్‌తో బెల్జియం 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement