కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా | Maybe it is the end of my career: Saina Nehwal | Sakshi
Sakshi News home page

కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా

Nov 2 2016 10:50 PM | Updated on Sep 4 2017 6:59 PM

కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా

కెరీర్ ముగిసిందా అనిపిస్తోంది: సైనా

మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని సైనా అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో మోకాలి గాయంతో పాల్గొని లీగ్ దశలోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వచ్చే వారంలో పునరాగమనం చేయనుంది. అయితే భవిష్యత్‌లో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోలేదని సైనా తెలిపింది. ‘చాలా మంది నా కెరీర్ ముగిసిందని భావిస్తున్నారు. ఇక పునరాగమనం చేయలేనని అనుకుంటున్నారు. గుండె లోతుల్లోంచి ఆలోచిస్తే ఒక్కోసారి నాకూ అలాగే అనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూద్దాం’ అని 26 ఏళ్ల సైనా అభిప్రాయపడింది.

నవంబరు 15 నుంచి జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ కోసం సైనా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ‘సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడాలని అనుకుంటున్నాను. నా పని అరుుపోయిందని ఇతరులు అనుకుంటే సంతోషమే. ఒకరకంగా ఇప్పటిదాకా వారు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక నుంచి నా గురించి వారు ఆలోచించడం మానేస్తారేమో’ అని సైనా తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement