
మెల్‌బోర్న్: బేబీ సిట్టర్.. ఈ మధ్య క్రికెట్‌లో బాగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం ముమ్మాటికీ రిషభ్ పంతే. ఇటీవల ఆసీస్ పర్యటనకు టీమిండియా వెళ్లినప్పుడు పంత్ బేబీ సిట్టర్ పేరుతో హాట్ టాపిక్‌గా మారాడు. దీనిపై ఏకంగా స్టార్ స్పోర్ట్స్ యాడ్ తీసేసింది. ఇందతా టీమిండియా కోసమే అనుకోండి. ఈ నెల చివర్లో భారత పర్యటనకు ఆసీస్ రానున్న తరుణంలో ఈ యాడ్‌ను రూపొందించింది స్టార్ స్పోర్ట్స్.
అందులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బేబీసిట్టర్ అవతారం ఎత్తాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో, సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. కాగా, దీనిపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ కౌంటర్ ఇచ్చాడు. ప్రధానంగా ఆసీస్ జట్టు జెర్సీలతో యాడ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. వరల్డ్‌కప్ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలన్నాడు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్ ద్వారా స్పందించిన హేడెన్.. యాడ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌ను, యాడ్ రూపొందించిన స్టార్ స్పోర్ట్స్‌లను ట్యాగ్ చేశాడు.
#BeWarned Never take Aussie’s for a joke Viru Boy @virendersehwag @StarSportsIndia Just remember who’s baby sitting the #WorldCup trophy https://t.co/yRUtJVu3XJ
— Matthew Hayden AM (@HaydosTweets) 11 February 2019